calender_icon.png 30 December, 2024 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్రోహులకు బుద్ధి చెప్పాలి

28-12-2024 02:39:55 AM

టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ

నిర్మల్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న కార్మికవర్గాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు, కార్మికులు బుద్ధి చెప్పాలని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ట పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ టీఎన్‌జీవో కార్యాలయంలో టీయూసీఐ జిల్లా 7వ మహాసభల్లో పాల్గొని న్నారు. వందలాది మంది కార్మికులతో ర్యా లీ నిర్వహించారు.

అనంతరం టీఎన్‌జీవో భవన్‌లో సంఘం జెండా ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన కార్మికుల సమావేశంలో కృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. కార్మికుల సంక్షేమం కోసం చట్టాలను నీరుగార్చేందుకు మోదీ ప్రభు త్వం కుట్రపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడంతో కార్మికులు ఇబ్బందులు ప డుతున్నారని పేర్కొన్నారు.