calender_icon.png 24 October, 2024 | 5:56 AM

దన ప్రభావంతో రైళ్లు రద్దు

24-10-2024 02:24:50 AM

విశాఖపట్నం, అక్టోబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన దన తుపాను కారణంగా పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దు, దారి మళ్లించిన వాటిలో సుమారు 200 సర్వీసులు ఉన్నాయి. 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు రైలు సర్వీసులను చేశారు. ప్రయాణికులకు రైలు సేవల వివరాలను తెలిపేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయగడ రైల్వేస్టేషన్ల లో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశారు. 

గంటకు 18 కిలోమీటర్ల వేగంతో..

దన తుపాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. వచ్చే 24 గంటల్లో తుపాను తీవ్రంగా బలపడనుంది. బుధవారం ఉదయానికి ఒడిశాలోని పరదీప్‌కు 560 కిలోమీటర్లు, పశ్చిమ్‌బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి 630 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని ఖేపురకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దనా ప్రభావంతో ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో  శనివారం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లోనూ భారీవర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది.