న్యూఢిల్లీ : వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు బిగ్ షాక్ తగిలింది. శిక్షణ నిలిపివేస్తున్నట్లు తాజాగా సాధారణ పరిపాలనా విభాగం నుంచి ఆమెకు ఆదేశాలు వెళ్లాయి. నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ పూజా ఖేడ్కర్ ను ట్రైనీంగ్ నుంచి వెనక్కి పిలిపించింది. పూజా అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమార్పించారన్న ఆరోపణలతో వార్తల్లోకెక్కారు. సోమవారం రాత్రి 11 గంటకు సివిల్ డ్రస్ లో ముగ్గు మహిళ పోలీసులు పూజా ఇంటికి వెళ్లారు. దాదాపు రెండు గంటలపాటు ఆమె విచారించారు.
పూజా ఖేడ్కర్ పై పలు ఆరోపణలు బయటకు వస్తున్నాయి. సివిల్ పరీక్షకు వేర్వేరు పేర్లతో హాజరైనట్లు తెలుస్తోంది. 2019లో దిలీప్ రావు అనే వ్యక్తి పేరుతో ప్రిలిమ్స్ రాయగా.. 2022లో పూజా మనోరమా దిలీస్ ఖేద్కర్ పేరుతో పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. రెండోసారి పూజా ఐఎఎస్ కు ఎంకైంది. సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్ కు చేసుకున్న దరఖాస్తులో తన వయస్సు వేరుగా కనిపిస్తోంది. తప్పుడు పత్రాలతో ఆమె ఎంబీబీఎస్ లో చేరినట్లు కాలేజీ యాజమాన్యం తేల్చింది. దీంతో కేంద్రం పూజా ఖేడ్కర్ వివాదంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మరోపక్క పూజా ఖేడ్కర్ తల్లి మనోరమా ఓ రైతును తుపాకీతో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.