12-02-2025 07:27:03 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని వైసిఓఏ క్లబ్ లో ఎస్ఏపీఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ పై ఈఆర్ పి డిపార్ట్మెంట్ కార్పొరేట్ ఆధ్వర్యంలో ఇల్లందు ఏరియాలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోకులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... మాన్యువల్ ఫైల్ డిస్పాచ్ నుంచి ఆన్లైన్ ఫైల్ డిస్పాచ్ కు త్వరలోనే మారుతున్నామని, ఈ మార్పులో భాగంగా మాన్యువల్ డిస్పాచ్ లో ఖర్చు అయ్యే చాలా సమయాన్ని, శ్రమను ఈ విధానం ద్వారా ఆదా చేయవచ్చని తెలిపారు.
ఈ ఆర్ పి డిపార్ట్మెంట్ కార్పొరేట్ నుంచి హరప్రసాద్ హాజరై వివిధ రకాల నోట్ ఫైల్స్, డాక్ ఫైల్స్ ఎఫ్ ల్ మ్ వెబ్ అప్లికేషన్ లో ప్రాసెస్ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జీఎం రామస్వామి, డి.జి.యం.(పర్సనల్) జి.వి.మోహన్ రావు, డీజీఎం (సివిల్) రవికుమార్, ఫైనాన్స్ మేనేజర్ మధుబాబు, మేనేజర్ (ఐ.టి) సుధాకర్, పర్చేస్ అధికారి దిలీప్ కుమార్, కార్పొరేట్ ఐటి విభాగం నుంచి జి. శ్రీ రమ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు.