08-03-2025 12:00:00 AM
పైలట్ సురక్షితం
పంచకుల, మార్చి 7: హర్యానాలోని పం చకుల జిల్లా అంబాలాలో శుక్రవారం ఓ శిక్షణ యుద్ధవిమానం కుప్పకూలింది. అం బాలా ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన విమా నం మార్గమధ్యలో కూలిపోయింది. ఈ ఘటనలో జెట్ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. శిక్షణలో భాగంగా ఈ ఘటన చో టు చేసుకుంది. ‘ఐఏఎఫ్‌కు చెందిన జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ అంబాలలో కూలిపోయింది. సాధారణ శిక్షణలో భాగంగా ఇది చోటు చేసుకుంది. పైలట్ చాకచక్యం వల్ల నివాసాలకు దూరంగా ఇది పడిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఐఏఎఫ్ ఈ ఘటన మీద విచారణకు ఆదేశించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు’ అని ఐఏఎఫ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.