09-04-2025 10:02:42 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బందికి డిఇ కార్యాలయంలో డివిజనల్ ఇంజనీర్ విజయ సారథి ఆధ్వర్యంలో ఎల్ సి (లైన్ క్లియర్) యాప్ పై బుధవారం నాడు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఎల్ సి తీసుకొని మరమ్మతులు చేసే క్రమంలో కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు జరుగుతాయని, అలాంటి ప్రమాదాలను నివారించడానికి ఎల్ సి యాప్ (లైన్ క్లియర్) యాప్ సాంకేతికంగా చాలా ఉపయోగపడుతుందని దీని ఉపయోగించి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డిఇ ప్రభాకర్ రావు, ఎ.డి.ఇ ప్రసాద్ రెడ్డి, లింగంపేట మండల ఏ.డి.ఇ మల్లేష్, ఏ ఈ రమణ చారి, ఎఫ్.ఎం గంగాధర్ బాలకృష్ణన్ విటల్ డివిజన్ పరిధిలోని పలువురు లైన్మెన్లు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.