calender_icon.png 8 February, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ

08-02-2025 05:26:45 PM

జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): పట్టభద్రులు, ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్  తెలిపారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల దృష్ట్యా శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఓ, ఏపీఓ, ఓపిఓ లకు మొదటి దఫా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 27 న జరుగనున్న మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కోసం కేటాయించిన సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

శిక్షణ తరగతులో తెలిపిన ప్రకారంగా విధులకు హాజరుకావాలని తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని, ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు ఆయా సామాగ్రిని తీసుకొని పరిశీలించి కొని, కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్ళాల్సి ఉంటుందని తెలిపారు. ఈనెల 27 న జరిగే ఎన్నికలు ఉదయం 8 గంటల నుండీ సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ ఎజెంట్ల సమక్షంలో నిర్వహించాలని, బ్యాలెట్ బాక్స్ లకు సీలింగ్ వేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు బయటి వ్యక్తుల ఎవరిని కూడా అనుమతించకూడదని, 200 మీటర్ల లోపు ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపారు. ప్రతీ 2 గంటలకు ఒకసారి పోలింగ్ వివరాలు ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రకటించాలని తెలిపారు.

పోలింగ్ ముగిసిన అనంతరం ప్రిసైడింగ్ అధికారి డైరీ సిద్ధం చేయాలని, అన్ని రిపోర్టులతో పాటు, సీల్ వేసిన బ్యాలెట్ బాక్స్ లను రిసెప్షన్ కౌంటర్ లో అందజేయాలని తెలిపారు. ఈ శిక్షణలో ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధుల గురించి మాస్టర్ ట్రెయినర్స్  రామకృష్ణ, లక్ష్మణ్ లు వివరించారు. బ్యాలెట్ బాక్స్ సీలింగ్, వినియోగం పై ప్రాక్టికల్ గా వివరించారు. రెండవ శిక్షణ త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని సీపీఒ రాజారాం తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ మన్నె ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, తదితరులు పాల్గొన్నారు.