04-04-2025 01:25:17 AM
హుజూర్‌నగర్, ఏప్రిల్ 3: ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుకు పోవాలంటే ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు అన్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఇటీవల నిర్వహించిన ఐఎన్‌టీఎస్ ఓ పరీక్షలో రెండో లెవెల్ లో విజయం సాధించిన విద్యార్థులను గురువారం అభినందించి మాట్లాడారు.
చిన్నారులకు కింది తరగతి నుంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఒలంపియాడ్ పరీక్షల్లో మంచి ప్రగతి సాధిస్తున్నా మని తెలి పారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎన్‌టీఎస్‌ఓ సెకండ్ లెవెల్‌లో మొత్తం 220 మంది పరీక్షకు హాజరు గాక 189 మంది విద్యార్థులు విజయం సాధించారు.
ఫస్ట్ ప్రైజ్ నిమిష్కవి చరిత, సెకండ్ ప్రైజ్ పోసాని మానస్ అరవింద్, థర్డ్ ప్రైజ్ చల్ల ధనుజ, హర్షిత లక్ష్మి, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్, కన్సోలేషన్ ప్రైజెస్, గోల్ మెడల్స్ 64, గోల్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ 83 మందికి,స్పెషల్ ప్రైజెస్ 8 మంది విద్యార్థులు సాధించారు.
కార్యక్రమంలో డీన్ ప్రేమ్ సాగర్, ప్రియాంక, శ్రీనివాస రెడ్డి, నాగ కన్య,సాయి కృష్ణ, రామ కృష్ణారెడ్డి, మాల కొండయ్య, గోవర్ధన్, శ్రీనివాస్, విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.