calender_icon.png 3 October, 2024 | 4:04 AM

ఎన్‌సీసీ క్యాడెట్లకు పారాసైలింగ్‌లో శిక్షణ

03-10-2024 02:05:45 AM

హైదరాబాద్, అక్టోబర్ 2(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో హైదరాబాద్ గ్రూప్‌కు చెం దిన ఎన్‌సీసీ క్యాడెట్లకు పారాసైలింగ్ శిక్షణలో ఇచ్చారు. నాయకత్వ నైపుణ్యాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొం దించుకోవడమే కాకుండా, క్యాడెట్‌ల నుంచి భయాన్ని దూరం చేయడానికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ పారాసైలింగ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పారాసైలింగ్ అనేది శారీరక దారుఢ్యాన్ని పరీక్షించడమే కాకుండా మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తుందని 5వ తెలంగాణ బెటాలియన్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ రాకేశ్ అన్నారు. ఇది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో చాలా అవసరమన్నారు. యు వ క్యాడెట్‌లు అసాధారణమైన ధైర్యా న్ని, క్రమశిక్షణను ప్రదర్శించారని ఎన్‌సీసీ హైదరాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ అనిల్ అభినందించారు.