12-03-2025 11:38:41 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ కు చెందిన వాటర్ ఎండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్(Water And Land Management Training Center) ఆధ్వర్యంలో వర్షాధార ప్రాంతంలో నేల, నీటి సంరక్షణ పద్దతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని రైతు వేదికలో వలంతరి పరిశోధన సంస్థ ప్రతినిధి సుబ్బారావు మాట్లాడుతూ.. అధిక వర్షపాతం కురిశినపుడు వర్షపు నీటిని నీటి కుంటల ద్వారా సంరక్షించుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ నీటి కొరత ఉన్న ప్రదేశాలలోనే కాకుండా, ఎక్కువ నీరు ఉన్న నీటిని తగ్గించి డ్రిప్ ద్వారా ప్రవహించే నీటిని చెక్ డాం ద్వారా సంరక్షించుకోవాలన్నారు. కేవికె కో ఆర్డినేటర్ డా. లక్షిమినారాయణ మాట్లాడుతూ టేకులపల్లిలో భిన్న రకాల పంటలు పండించే ఆకాశవాయితో ఉందని ఇక పంట మార్పిడి చేసుకోవాలన్నారు. ఇల్లందు ఏడిఏ లాల్ చాంద్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రైతు బోర్ పక్కన 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నీటి గుంతను తీసుకొని నీటిని రీఛార్జి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వాలంతరి ఏఓ ఎస్ అన్నపూర్ణ, ఎంఏఓ ఎన్.అన్నపూర్ణ, ఏఈఓ లు పాల్గొన్నారు.