ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబందించిన శిక్షణను బుధవారం స్థానిక సిఈఆర్ క్లబ్ లో నిర్వహించారు. ఇల్లందు తహసీల్దాహార్ రవికుమార్, ఎంపిడీఓ ధన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణలో ఇల్లందు మున్సిపాలిసీటీ నుంచి 81 మందికి, ఇల్లందు మండలం నుంచి 139 మంది ఎన్యూమరేటర్లకు, 22మంది సర్వీసర్లకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ తీసుకున్న ఎన్యుమరేటర్లు నవంబర్ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ చిరంజీవి, మునిసిపల్ డిఈ మురళి, ఏపీఎం దుర్గారావు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ పాల్గొన్నారు.