calender_icon.png 22 February, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణా తరగతులు

22-02-2025 12:06:58 AM

హాజరైన హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత    

ఎల్బీనగర్ , ఫిబ్రవరి 21 :  ఉద్యోగులు, సిబ్బందిలో నైపుణ్యాలను మెరుగుపర్చడం,  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న సవాళ్లను తట్టుకోవడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలతో డిపోల్లో POWER (Peak performance through Ownership with Empathy and Resolve) శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. హయత్ నగర్ - 1 డిపోలో శుక్రవారం నిర్వ హించిన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి ఆర్టీసీ సంస్థ అభివృద్ధి పథంలో కొనసాగుతుంద న్నారు. కానీ, ఉద్యోగులకు పనిభారం, ఒత్తిడి రోజురోజుకు అధికం అవుతున్నా ఎంతో ఓర్పు, సహనంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల భద్రత,  లక్ష్యంగా పెట్టుకొని విధులు నిర్వహిం చడానికి  శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విధి నిర్వ హణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిం చడానికి పద్దతులు, విధులు ముగిసిన తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్ర త్తలు, ఆహారపు అలవాట్లను డిపో మేనేజర్ విజయ్ వివరించారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్లు విజయకుమారి, సత్తయ్య, నరేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.