13-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12 (విజ యక్రాంతి) ః జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి శిక్షణా తరగ తులు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయ తీ అధికారి చంద్రమౌళి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో రెండవ విడత సాధారణ ఎన్నికలు సర్పంచి, వార్డ్ గ్రామపంచాయతీల ఎన్నికకు పోలింగ్ లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నియా మావళిని అనుసరించి మొదటి విడత శిక్ష ణా తరగతులు ఈనెల 13వ తేదీ కొత్త గూడెంలోని జడ్పీహెఎస్ ఆనందఖని మార్వాడి క్యాంప్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో రిటర్నిం గ్ అధికారులు మరియు సహాయ రిటర్నిం గ్ అధికారులు 350 మంది,ఎంవోటీలు 46 మంది శిక్షణ కార్యక్రమంలో పాల్గొన నున్నట్లు తెలిపారు.