calender_icon.png 18 April, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు నిర్వాహకులకు శిక్షణా తరగతులు

09-04-2025 03:29:37 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కొరకు రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనకుండా ముందస్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, లక్షెట్టిపేట యందు జన్నారం, దండేపల్లి, లక్షెటిపేట, హాజీపూర్ మండలాల యొక్క వ్యవసాయ, పౌరసరఫర, సహకార, రవాణా, మార్కెటింగ్, డి.ఆర్.డి.ఎ సెర్ఫ్ శాఖల మెప్మా అధికారులతో కలిసి, యాసంగి 2024-25 వరి దాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు శిక్షణా తరగతులు మంగళవారం సాయంత్రం అదనపు కలెక్టర్ మోతిలాల్ నిర్వహించినారు. ఈ సందర్భంగా అదనపు  కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ... నిబంధనలకు మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.  యాసంగి 2024-25 సంవత్సరానికి గాను గ్రేడ్ A రకానికి 2320/-గా,  సాధారణ రకానికి 2300/-గా  మద్దతు నిర్ణయించారు. 

వేసవి అయినందున షెడ్, త్రాగునీరు సౌకర్యాలు కల్పించడంతో పాటు  ఓఆర్ఎస్ మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలని సూచించారు. తూకం వేయడానికి వినియోగించే కాoట,బాట్లు, తేమశాతాన్ని పరిశీలించే మాయిశ్చర్ మీటర్, ప్యాడి క్లీనర్స్, డిజిటల్ మెట్రో మీటర్స్,గన్ని సంచులు సమకూర్చుకోవాలన్నారు. ఆకాల వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవసరమైన టార్పలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని ప్రతి కొనుగోలు కేంద్రం కనీసం 25 టార్పిన్లు అందుబాటులో  ఉండాలని సూచించారు. ధాన్యం తూకం వేయడానికి ముందే సంబంధిత రైతు వద్ద నుండి ఏవో/ ఏఈఓ జారీ చేసిన కూపన్, బ్యాంకు పుస్తకం, ఆధార్ కార్డు, పట్టా పుస్తకములు నకలు రైతు వద్ద నుండి  తీసుకోవాలని వాటి వివరాలు ట్యాబ్ లో నమోదు చేసి, రైతుకు రశీదు జారీ చేయాలన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

తేమ శాతం 17% లోపు వచ్చిన తరువాతే తూకం వేయాలని సూచించారు. సన్న రకం ధాన్యం నిలువ చేసే గోనె సంచులను తెల్ల దారంతో, దొడ్డు రకం దాన్యం నిర్వహించిన సంచులను ఆకుపచ్చ రకం దారంతో కట్టువేయాలని, సన్నరకం దాన్యం నింపే గుణ సంచులు అని గుర్తించిన పాటు కొనుగోలు కేంద్రం కొనుగోలు వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. కేంద్రానికి వచ్చిన గన్ని సంచులను సరిచూసుకోవాలని, వాటి  వివరాలు రిజిస్టర్ లో  నమోదు చేయాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని నిబంధన మేరకు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగిoగ్  చేయబడిన రైస్ మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు.

సన్న రకం దాన్యం మిల్లులకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలను నీరు నిలువలేని ఎత్తైన ప్రదేశాలలో, వాహనాలు రాకపోకలు అనువుగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రం లో కేంద్రం పేరు,కోడ్, మద్దతు ధర, నాణ్యత ప్రమాణాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని తెలిపారు.  రైతులు కల్లాలలో అరబెట్టి, తప్పా, తాలు, మట్టి గడ్డలు  లేకుండా నిబంధనల ప్రకారం పరిశీలించుకొని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రానికి  రైతులు తీసుకొనివచ్చేలా అవగాహన కల్పించాలి అని సూచించారు. ఇట్టి కార్యక్రమములో జిల్లా పౌర సరఫరాల అధికారి, బ్రమ్మరావు,డి.ఆర్.డి.ఓ, కిషన్, పౌర సరఫరాల మేనజర్, శ్రీకల, దిలీప్ కుమార్ తహశీల్దార్, లక్షెట్టిపేట, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.