09-04-2025 07:26:18 PM
కోదాడ: స్థానిక కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో డేటా బేస్ ప్రోగ్రామింగ్ తో యస్ క్యూల్ అనే సాఫ్ట్వేర్ పై మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ట్రైనర్ గా వచ్చినటువంటి నరేష్ ప్రోగ్రామింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు, విభాగాధిపతురాలు డాక్టర్ స్రవంతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.