calender_icon.png 23 March, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిక్షణ పొందిన అభ్యర్థులు జీవితంలో నిలదొక్కుకోవాలి

22-03-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 21 (విజయ క్రాంతి): తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్, నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లోని పాత కలెక్టరేట్ భవనంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్, నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ పొందిన అభ్యర్థులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను వినియోగించుకొని జీవితంలో ఎదగాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా కృషి చేయాలని తెలిపారు. 40 రోజులపాటు కంప్యూటర్ శిక్షణ, టైప్ రైటింగ్ మెలకువలు అభ్యర్థులకు అందించడం జరిగిందని, శిక్షణలో పొందిన నైపుణ్యతతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో నిలదొక్కుకోవాలని అన్నారు.

వివిధ కంపెనీలలో పని చేసేందుకు అవకాశాలు ఉన్నాయని, శిక్షణలో పొందిన నైపుణ్యత, పరిజ్ఞానంతో రాణించాలని తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులు మరిన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం సమన్వయకర్త సాయికుమార్, శిక్షకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.