calender_icon.png 2 October, 2024 | 10:05 AM

నేటి నుంచి రైళ్ల రాకపోకలు

04-09-2024 03:20:00 AM

  1. మంగళవారం నాటికి 524 రైళ్లు రద్దు
  2. దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 524 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి 496 రైళ్లు రద్దు కాగా... మంగళవారం నాటికి మరో 28రైళ్లను రద్దు చేశా రు. 152 రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్, కాజీపేట నుంచి విజయవాడ మార్గంలో వెళ్లే రైళ్లన్నీ రద్దుపోయాయి. దీంతో కాజీపేట విజయవాడ మధ్య ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలను కలిపే మధ్య రైల్వే సేవలు ఆగిపోయినట్లుంది.

విజయవాడ, విశాఖపట్నం, మణుగూరు, కాకినాడ, హౌరా, గుంటూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని ఉన్న కల్వర్ట్ వద్ద రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోయి ట్రాక్ గాల్లోతేలింది. అధికారులు యుద్ధప్రాతిపది కన దాదాపు 36 గంటల మేరకు పనులు చేపట్టారు. మంగళవారం రాత్రి నాటికి పనులు పూర్తి కావచ్చాయి. దీంతో ట్రాక్ ట్రయల్ రన్ పూర్తిచేసి బుధవారం ఉద యం నుంచి రైళ్లను తిప్పేందుకు సిద్ధమైనట్లు సమాచా రం. మొదట ఒక ట్రాక్‌లో రైళ్లను తిప్పనున్నారు. మధ్యా హ్నం నుంచి రెండో ట్రాక్‌పైనా రైళ్లను నడపనున్నారు. రద్దున, దారి మళ్లించిన రైళ్లను దశలవారీగా తిరిగి ఈ మార్గంలో నడిపేందుకు కసరత్తు చేయనున్నారు. 

ఇబ్బంది పడిన ప్రయాణికులు..

ద.మ.రైల్వే పరిధిలో ప్రధానమైన రైల్వే లైన్ అయిన కాజీపేట విజయవాడ మార్గంలో లైన్లు అన్ని వర్షాల బారిన పడటంతో జోన్‌లోని ముఖ్యమైన రైళ్లన్నీ రద్దయ్యాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందు లు పడ్డారు. చాలా మందిని బస్సుల్లో విజయవాడ, కాజీపేట తరలించి అక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చారు. రిజర్వేషన్లు చేసుకున్న వారు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు అనేక వ్యాగన్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణాకు కూడా అవకాశం లేకపోవడంతో ద.మ.రైల్వే కోట్లాది రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు తెలిపారు.