calender_icon.png 3 April, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం

01-04-2025 11:53:39 PM

ముగ్గురు మృతి.. నలుగురికి గాయాలు

రాంచీ: జార్ఖండ్‌లో మంగళవారం తెల్లవారుజామున సాహిబ్‌గంజ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు.. బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్లు సహా ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ జవాను కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. గాయపడిన వారికి బార్‌హైత్ కమ్యూనిటీ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.