calender_icon.png 13 January, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై తీరంలో విషాదం

19-12-2024 01:50:34 AM

* ఫెర్రీ బోటును ఢీకొట్టిన నేవీ బోటు

* ప్రమాదంలో 13 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ముంబై, డిసెంబర్ 18: ముంబై సము ద్ర తీరంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో కూడిన ఫెర్రీ బోటును నేవీ బోటు ఢీ కొట్టడంతో దాదాపు 13 మంది ప్రాణా లు కోల్పోయారు. ఎలిఫెంటా దీవుల నుంచి దాదాపు 110 మంది ప్రయాణికులతో కూడిన నీల్‌కమల్ అనే ఫెర్రీ బోటు ఇండియా గేట్ వైపు వస్తుండగా అదుపు తప్పిన నేవీ స్పీడ్ బోటు దాన్ని ఢీ కొట్టిం ది. దీంతో ఫెర్రీ బోటు సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సాధారణ ప్రజలతోపాటు ముగ్గు రు నేవీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సహాయ చర్యలను ప్రారంభించిన అధికారులు 108 మందిని కాపాడారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి. ఈ ఘటనపై స్పందించిన నేవీ.. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతోనే స్పీడ్ బోటు అదుపు తప్పినట్టు వెల్లడించింది. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. కాగా, నేవీ స్పీడ్ బోట్‌లో ఎంత మంది ఉన్నారన్న విషయంపై స్పష్టత లేదు.