03-04-2025 12:05:58 AM
రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో లోకోపైలట్ మృతి
న్యూఢిల్లీ: ఏండ్ల పాటు విధులు నిర్వహించి.. పదవీ విరమణ ద్వారా తన కుటుంబంతో హాయిగా గడపొచ్చని కలలుగన్న లోకోపైలట్ రిటైర్‌మెంట్ రోజే తుదిశ్వాస విడిచాడు. ఆయనతో కలిసి భోజనం చేయాలని ఎదురుచూస్తున్న అతడి కుటుంబానికి కన్నీరే మిగిలింది. ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో లోకో పైలట్ గంగేశ్వర్ మృతిచెందగా ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం ఉదయం 3 గంటలకు రాంచీలోని సాహిబ్‌గంజ్ జిల్లాలో విద్యుత్ సంస్థ ఎన్టీపీసీకి చెందిన రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో గూడ్సు రైళ్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన లోకోపైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కాగా అదేరోజు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది.