calender_icon.png 10 January, 2025 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రరాజ్యంలో విషాదం

02-01-2025 03:17:57 AM

  • ట్రక్‌తో ఢీ కొట్టి, తుపాకీతో కాల్పులు
  • 1౦ మంది మృతి

వాషింగ్టన్, జనవరి 1: కొత్త సంవత్సరం రాబోతుందని దునియా మొత్తం సంబురాలు చేసుకుంటున్నారు. అదే విధంగా అక్కడ కూడా జనం ఆనందోత్సాహాలతో గడుపుతున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఉదయం పూట 3.15 ప్రాంతం లో అమెరికాలోని న్యూఒర్లీన్స్ పట్టణంలో ఓ ట్రక్ బీభత్సం సృష్టించింది.

తర్వాత ఆ ట్రక్  డ్రైవర్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 10 మంది మృత్యువాతపడగా.. మరో 35 మందికి గాయాలయినట్లు తెలుస్తోంది.  ఘటన జరిగిన బోర్‌బాన్ స్ట్రీట్ నైట్ షాపింగ్‌కు ఫేమస్. అక్కడ సాధారణ రోజుల్లోనే రాత్రుళ్లు జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అటువంటిది న్యూఇయర్ వేళ మరింత మంది ఆ వీధిలో సంబురాల్లో మునిగి తేలారు.

సహాయక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతం మొత్తం భయానక దృశ్యాలతో నిండిపోయింది. ప్రమాదానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రు లకు తరలించారు.

ఈ కేసును ఎఫ్‌బీఐ విచారణకు స్వీకరించింది. మృతులు ఎందరనేది ఖచ్చితంగా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఏరియాలో ఎవరూ సంచరించొద్దని స్థానిక పోలీసులు కోరారు. 

ఉగ్రదాడిగా వర్ణించిన మేయర్.. కొట్టిపారేసిన ఎఫ్‌బీఐ

ఈ దాడిని నగర మేయర్ ఉగ్రదాడిగా అభివర్ణించారు. అయితే కేసును దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ ఏజెన్సీ మాత్రం ఈ వాదనలను కొట్టిపారేసింది. ప్రమాదం జరిగినపుడు సంఘటనా స్థలంలోనే ఉన్న ప్రత్యక్షసాక్షి కూడా తనకు కాల్పుల చప్పుడు వినిపించిందని తెలిపారు.