calender_icon.png 3 April, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు రాక ఉపాధ్యాయ కుటుంబంలో విషాదం

28-03-2025 12:07:38 AM

  1. దాచుకున్న పైకం అందక
  2. నిండు ప్రాణం బలైంది 
  3. పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా    
  4. పాడే మోసి నిరసన

భద్రాద్రి కొత్తగూడెం మార్చి 27(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం పి ఆర్ టి యు పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించాలని ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం ఎండలో కూర్చొని నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమాన్ని ఉ ర్దేశించి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి వెంకటేశ్వరరావు బి రవి పాల్గొని మాట్లాడుతూ మాట్లాడుతూజిపిఎఫ్ పార్ట్ ఫైనల్ డబ్బులు రాక మెరుగైన వైద్యం అందక ఉపాధ్యాయుని సతీమణి మృతి చెందడం విచారకరం అన్నారు. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించిన తర్వాత మిగిలిన సొమ్ము జడ్పీ జిపిఎఫ్ ఖాతా లోదాచుకోవడం జరుగుతుంది. వాటిని విద్యకు, వైద్యానికి, గృహ నిర్మాణానికి, తీసుకునే వెసులుబాటు ఉన్నది. కాని దరఖాస్తు చేసుకున్నాం 15 రోజుల లోపట వారి ఖాతాలో డబ్బులు జమ చేయాల్సి ఉన్నది.

కాని ఖాతాలోజమ కాకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం,అన్యాయం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా టి ఎస్ జి ఎల్ ఐ, మరియు ఎస్ ఎల్  రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో చెల్లించాలని డిమాం డ్ చేశారు. ఇటీవల పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న పొదిలి సత్యనారాయణ భార్య పొదిలి .శ్రీమతి (లత ) దీర్ఘకాల అనారోగ్యంతో భాదపడుతుండడంతో మెరుగైన వైద్యం కై జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ , సరండర్ లీవ్ కు దరఖాస్తు చేసినారు.

దరఖాస్తు చేసి ఏడాది గడిచిన డబ్బులు రాకపోవడంతో మెరుగైన వైద్యం అందక గురువారం మృతి చెందారు. దాచుకున్న సొమ్ము అవసరాలకు అందక నిండు ప్రాణం కోల్పోవడతో ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారు.ఈ మృతికి ప్రభుత్వమే భాద్యత వహించాలని ఇది హృదయ విషాదకర సంఘటన అని విచారాన్ని వ్యక్తం చేసినారు. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనీ డిమాండ్ చేసినారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరావు భూక్యా శ్రీనివాస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సంఘమేశ్వరావు గారు పాల్వంచ మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి గారు మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతి సుధాశ్రీ పద్మజ టేకులపల్లి మండల అధ్యక్షులు ఈ మోతిలాల్ బూర్గంపాడు మండల అధ్యక్షుడు శంకర్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.