మానకొండూర్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి) : బంధువుల ఇంటికి వెళ్లి కడప పెట్టి తిరిగి వస్తుండగా సీరిసిల్ల జిల్లా కొదిరూపాక వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో గట్టు బాబు భార్య మంగ అక్కడికక్కడే చనిపోవడం ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి తెలుసుకున్న బంధువులు కాలనీవాసులు తమ ఇంటికి చేరుకొని బోరుణ విలపిస్తూ రోదించారు.
దీంతో కాలనీలో విషాదఛాయలు అలుము కున్నాయి. కొన్ని సంవత్సరాలుగా అయ్య ప్ప దీక్షలో ఉన్న గట్టు స్వామి మా బంధు వుల ఇంటికి వెళ్లి కడప పెట్టి వస్తాను స్థాని కంగా తిమ్మాపూర్ గ్రామంలో కన్నె స్వామి పూజ ఘనంగా చేద్దామని చెప్పి వెళ్లిన ఆయన జరిగిన రోడ్డు ప్రమాదం గురించి అయ్యప్ప స్వాములు చర్చించుకుని విచారం వ్యక్తం చేస్తున్నారు.