calender_icon.png 26 December, 2024 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ నిమజ్జనంలో విషాదం

22-09-2024 02:27:50 PM

గుంతలో పడి యువకుని గల్లంతు...

ఆదిలాబాద్,(విజయక్రాంతి): గణేష్ నిమజ్జనంలో విషాదం నెలకొంది. బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో విషాదఘటన చోటుచేసుకుంది. పిప్రి గ్రామ శివారులో ఉన్న స్టోన్ క్రషర్ వద్ద బండల కోసం తవ్విన గుంతలో పడి రాకేష్ (20) అనే యువకుడు గల్లంతు అయ్యాడని స్థానికులు తెలిపారు. వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన రాకేష్ గణేష్ నిమజ్జనం కోసం క్రషర్ క్వారీలో ఉన్న నీటి గుంతలో వినాయక విగ్రహ నిమజ్జనానికి రావడంతో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు క్రషర్ స్టోన్ కోసం తవ్విన గుంతలో పడి గల్లంతయ్యాడు. దీంతో స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించగా గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు