calender_icon.png 4 January, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకల్లో విషాదం

02-01-2025 12:30:33 AM

వివిధ కారణాలతో ఏడుగురు దుర్మరణం

కామారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరం వేడుకల్లో విషాదం నెలకొంది. వివిధ కారణాలతో బుధవారం ఏడుగురు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన పురం ధనుంజయ్(28) భార్య విడాకులు తీసుకోవడంతో ఒంటరిగా ఉం యుత్నూడు.

జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గ్రామం  వైన్స్‌షాప్ పర్మిట్ రూంలో మంగళవారం రాత్రి అతిగా మద్యం సేవించి, కిందపడి మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తు  ఎస్సై లావణ్య తెలిపారు. అదేగ్రామానికి చెందిన సంతోష్ 15 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఇదే మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన షేక్ గౌస్(45) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రామారెడ్డి మండలానికి చెం  పొట్టిగారి శివప్రసాద్(22) మంగళవారం రాత్రి  దావత్ చేసుకుని మద్యం మత్తులో చెరువులో ఈతకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా ఒడ్డున విగతజీవిగా కనిపించాడు. 

బైక్ అదుపుతప్పి.. 

కూసుమంచి, జనవరి 1: బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోవడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామానికి చెందిన షేక్ జాన్ పాషా (32) డిసెంబర్ 31 రాత్రి తన మిత్రుడిని చేగొమ్మ గ్రామంలో దించి, బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. చింతలతండ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో తలకు బలమైన గాయాలై మృతి చెందాడు. 

సాగర్ కాల్వలో ఇద్దరు ఇంజినీర్ల గల్లంతు

నల్లగొండ, జనవరి 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వలో బుధవారం ఇద్దరు ఇంజినీర్లు గల్లంతయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్తీక్ మిశ్రా, విజయ గోస్వామి మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్‌లో నివాసముంటూ దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ ప్లాంటులో ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. బుధవారం నూతన సంవత్సరం కావడంతో ఆటవిడుపుగా ఐలాపురం సమీపంలో సాగర్ ఎడమ కాల్వలో మరి కొందరు యువకులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రవాహ ఉధృతిలో ఇద్దరూ గల్లంతయ్యారు.