కుటుంబ తగాదాలతో సాఫ్ట్ వేర్ దంపతుల ఆత్మహత్య
అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ బంధం కొమ్ములో తీవ్ర విషాదం నెలకొన్నది. కుటుంబ కలహాలతో సాఫ్ట్ వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఊహ తెలియని ప్రాయంలోనే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. అమీన్ పూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాల మేరకు.... మంచిర్యాలకు చెందిన చెట్టి కీర్తి (34) హైదరాబాద్ మియాపూర్ కు చెందిన జంగిలి సందీప్ (36)లకు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు గగనహిత (3), 14 నెలల కొడుకు సాకేత్ రామ్ ఉన్నారు. గత కొంతకాలంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము శ్రీరామ్ హిల్స్ లో నివాసము అంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కలహాలు చేసుకుంటున్నాయి.
సోమవారం కూతురు పుట్టిన రోజు ఉండడంతో ఈ విషయంలో ఆదివారం సాయంత్రం భార్యాభర్తలు గొడవపడ్డారు. గొడవ జరిగిన తర్వాత భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కొంత సేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చాడు. ఈలోపు భార్య కీర్తి చున్నితో ఫ్యానుకు ఉరి వేసుకుంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతి చెందడం చూసిన భర్త సందీప్ కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లల రోదన మిన్నంటింది. పక్కింటి వాళ్ళు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమీన్ పూర్ సీఐ సదా నాగరాజు, ఎస్సై సోమేశ్వరి సిబ్బందితో పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.