calender_icon.png 22 December, 2024 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండగపూట విషాదం..

13-10-2024 11:56:32 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు..

ఆదిలాబాద్, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో పండగపూట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ లోని భాగ్యనగర్ కాలనీకి చెందిన జితేష్, అనిల్, నాగరాజ్ లు ద్విచక్ర వాహనంపై గుడిహత్నూర్ నుండి అదిలాబాద్ వైపు వస్తుండగా మావల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో జితేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా నాగరాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మావల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.