calender_icon.png 18 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ స్టేడియంలో దారుణం..

17-03-2025 11:03:13 PM

అప్పుడే పుట్టిన పసికందును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

క్లూస్ టీం, డాగ్ స్క్వేడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): నగర నడిబొడ్డున గల ఇందిరా పార్క్ ఎదురుగా ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నిప్పంటించి తగులబెట్టిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నవజాత శిశువుకు నిప్పంటించిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దోమలగూడ సిఐడి. శ్రీనివాస్ రెడ్డి ఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అప్పుడే పుట్టిన ఆడ శిశువుగా ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పసికందును బతికుండగా చేశారా, లేదా మృతి చెందిన పసికందును ఆధారాలు లేకుండా చేసేందుకు ఇక్కడికి తీసుకువచ్చి తగులబెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయాలను సీసీ కెమెరాలు ఆధారంగా గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.