calender_icon.png 20 September, 2024 | 6:20 AM

పండుగ పూట ఇంట్లో విషాదం

19-09-2024 12:26:07 AM

క్రాకర్స్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు

ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

చార్మినార్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మిలాద్ ఉన్ నబీ పండుగ రోజు పాత బస్తీలోని ఓ ఇంట్లో నిలిచిన పటాకులు ప్రమా దవశాత్తు పేలాయి. ఘటనలో ఆరు గురికి తీవ్రగాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్ రఘనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్ బాగ్‌లో హాఫీజ్, షాజీరాబేగం అనే దంపతులు నివసిస్తున్నారు. వీరు కొద్ది రోజుల క్రితం 30 కిలోల లైజన్ పటాకులు తెచ్చి ఇంట్లో నిల్వ ఉంచు తున్నారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా బుధవారం హాఫిజ్ కుమార్తె సామీనాబేగం తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది.

సాయంత్రం ఇంట్లో ఏం జరిగిందో తెలియదు గానీ పెద్దశబ్దంతో పటాకు లు పేలాయి. ఘటనలో హాఫీజ్, షాజీరాబేగంతో వారి కోడలు, కుమా ర్తె సామీనాబేగం, ఆమె ఇద్దరు పిల్లలు గాయాలపాలయ్యారు. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేసి ఆరుగురు క్షతగాత్రులను ఉస్మాని యా వైదశాలకు తరలించారు. వీరిలో షాజీరాబేగం, సమీనాబేగం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్రా ఆరా తీశారు. బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.