17-04-2025 01:00:31 AM
- ప్రియదర్శిని పార్క్ ఎదుట బ్రిడ్జి నిర్మాణం
- స్థలాన్ని పరిశీలించిన జీహెచ్‌ఎంసీ అధికారులు
-బ్రిడ్జి నిర్మాణంతో లింగోజిగూడ డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 16 : సరూర్ నగర్ చెరువు - కర్మన్ ఘాట్ - ఎల్బీనగర్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరుతున్నాయి. ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి పొందేందుకు సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ సమీపంలో నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సుమారు రూ, 5.95 కోట్ల నిధుల అంచనా వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు.
బ్రిడ్జి నిర్మాణ పనుల స్థలాన్ని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ శివకుమార్ నాయుడు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, మెయింటెనెన్స్ సీఈ రత్నాకర్ రావు, ఎస్‌ఎన్ డీసీపీ కోటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ నారాయణ, ఎస్‌ఎన్ డీపీ ఈఈ రవిశంకర్, డిప్యూటీ కమిషనర్ సేవాలాల్ తో కలిసి బుధవారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణంపై పరిసర ప్రాంతాలను పరిశీలించి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జిని నిర్మించే విధంగా అధికారు లతో చర్చించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిడ్జి పనులు పూర్తయితే లింగోజిగూడ డివిజన్ ప్రాంత ప్రజలకు సరూర్ నగర్ నుంచి వచ్చేవారికి ట్రాఫిక్ సమస్య విముక్తి పొందుతారన్నారు. సరూర్ నగర్, లింగోజిగూడ ప్రాంతాల్లో వ్యాపార అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోదపడుతుందన్నారు. త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డీఈ కార్తీక్, ఎస్‌ఎన్ డీపీ డీఈ వెంకట కిరణ్, డీఈ రవిచంద్, నగేశ్ నాయక్, ఇరిగేషన్ ఏఈ సతీశ్, జీహెచ్‌ఎంసీ కీర్తి, వెటర్నరీ అధికారి యాదగిరి, కాంగ్రెస్ నాయకులు పల్సం శ్రీధర్ గౌడ్, కందికంటి శ్రీధర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, ప్రేమ్ నాథ్ గౌడ్, రోహిత్ రెడ్డి, రాజు, ఆదర్శ్, మనోజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.