calender_icon.png 24 October, 2024 | 6:59 PM

మంథని పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు

24-10-2024 04:09:51 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో ట్రాఫిక్ కాష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పట్టించుకోని పోలీసులపై, మున్సిపల్ అధికారులపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు, ఇటు పోలీస్ స్టేషన్ వరకు, అటు గాంధీ చౌక్ వరకు రోడ్లపైనే బైకులు, కార్లు, పార్కింగ్ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు పార్కింగ్ చేయడంతో, పట్టణంలో ద్విచక్ర వాహనలపై వెళ్లాలన్న, నడుచుకుంటూ వెళ్లాలంటే తమ ప్రాణాలు ఆరిచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా మున్సిపల్, పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసి పట్టణ ప్రజల కష్టాలు తీర్చాలని ప్రజలు  కోరుతున్నారు.