calender_icon.png 12 February, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేళాలోట్రాఫిక్ ‘టెర్రర్’

12-02-2025 01:55:09 AM

* గంటల పాటు ప్రయాణికుల నరకయాతన

* వాహనాల్లో చిన్నారులు, మహిళల అగచాట్లు

* తినేందుకు తిండి కూడా కరువు

* పెట్రోల్ బంకులు ఖాళీ!

* నో వెహికిల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్..

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 11: మహాకుంభమేళాలో ట్రాఫిక్ టెర్రర్ కొనసాగుతోంది. వారాంతం వల్ల ప్రయాణికులు కుంభ్‌కు పో టెత్తడంతో పరిసరాలన్నీ వాహనాలతో నిం డిపోయాయి. చుట్టు పక్కల ఎటు చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి.

బుధవారం మాఘ పూర్ణిమ కావడంతో మరింత మంది భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రయాగ్‌రాజ్ అధి కారులు ముందుగానే అలర్ట్ అయ్యారు. ట్రా ఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. 

వాహనాల్లోనే 48 గంటలు.. 

దేశవ్యాప్తంగా వేలాది మంది కుంభమేళా కు పోటెత్తడంతో రోడ్డుపై భీకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. 350 కిలోమీటర్ల వరకు వాహనాలు క్యూ కట్టినట్లు ప లువురు పేర్కొంటున్నారు. వాహనాల్లోనే 4 8 గంటల పాటు గడిపినట్లు పలువురు వా పోతున్నారు. తినేందుకు తిండి కూడా సరిగ్గా దొరకలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. 

ఖాళీ అయిన పెట్రోల్

ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో పెట్రోల్ కొర త ఏర్పడినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున భక్తు లు పోటెత్తడంతో  స్థానిక బంకుల్లోని ఇంధ నం మొత్తం ఖాళీ అయినట్లు తెలుస్తోంది.

నో వెహికిల్ జోన్‌గా ప్రయాగ్ రాజ్

 మంగళవారం ఉదయం నుం చే కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా మార్చిన అధికారులు సాయంత్రం నుంచి ప్రయాగ్‌రాజ్ మొత్తాన్ని నో వెహికిల్ జోన్‌గా మా ర్చారు. యూపీ సీఎం యోగి కూ డా ట్రాఫిక్ పరిస్థితిపై అధికారులతో సమావేశం అయ్యారు. 

కుంభమేళాకు అంబానీ కుటుంబం

మహాకుంభమేళాకు మంగళవారం  ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, సతీమణి నీతా అం బానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కోడ ళ్లు శ్లోక, రాధికతో కలిసి వచ్చారు.