calender_icon.png 27 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రహరీకీ అనుమతి ఉండాలి

27-10-2024 02:26:52 AM

  1. తాత్కాలిక కట్టడమైనా అనుమతి తీసుకోవాల్సిందే
  2. హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): ఏ భూమిలోనైనా శాశ్వత నిర్మాణమే కాకుండా ఆ జాగాకు ప్రహరీ నిర్మించాలన్నా సంబంధిత మున్సిపాలిటీ అనుమతి విధిగా తీసుకోవాలని హైకోర్టు కీలక తీప్పు చెప్పిం ది. ప్రహరీని తాత్కాలికంగా నిర్మించాలన్నా.. శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలన్నా ముం దుగానే అధికారుల అనుమతి తీసుకోవాల ని స్పష్టంచేసింది.

తమ ప్రహరీని కూల్చేశారని బాధితులు కోర్టుకు వస్తే తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏపీలోని కర్నూలు జిల్లా పాణ్యానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య కే ఉమా మహేశ్వరమ్మకు చెందిన వ్యవసాయ భూమిలోని షెడ్డును హైడ్రా కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

పటాన్‌చెరు సమీపంలోని అమీన్‌పూర్‌లో తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మాణాలు అమీన్‌పూర్ సరస్సు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయనే కారణంతో హైడ్రా 45 రోజుల క్రితం ఆ షెడ్లను కూల్చేసింది. తమ వ్యవసాయ భూమిలోని ఫామ్‌హౌస్ చుట్టూ తాత్కాలికంగా కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు మున్సిపాలిటీ అధికారులు అనుమతిచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఉమామహేశ్వరమ్మ హైకోర్టును కోరారు.

తాత్కాలిక ప్రాతిపదికన ప్రహరీ నిర్మాణ అనుమతికి ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ కోర్టును అభ్యర్థించారు. అయితే ఆ ఉత్తర్వు లు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకో వాలని, అనుమతి లభిస్తేనే ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రహరీ నిర్మాణ అనుమతులకు ఉత్తర్వులు కోర్టులు జారీ చేయబోవని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ తేల్చి చెప్పారు.