calender_icon.png 13 January, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమం

13-01-2025 04:53:14 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): ట్రాఫిక్ భద్రత వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలోని పలు ఆటోలను ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేశారు. పరిమితికి మించి అదనపు సీట్లను ఏర్పాటు చేసి తోలుతూ తరచూ ప్రమాదాల గురవుతుండడంతో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని బోధన్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఎస్సై చంద్రమోహన్ రహమతుల్లా ట్రాఫిక్ సిబ్బందితో పాటు తనిఖీలు నిర్వహించారు. ఆటోలో నిర్ణీత ప్యాసింజర్ల కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టకూడదని అందుకు ఏర్పాట్లు చేయకూడదని ఎప్పటికప్పుడు ఇన్సూరెన్స్లను చేయించుకోవాలని డ్రైవర్ లకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు మాత్రమే ఆటోలు నడపాలని ఆటోలలో ఊఫర్ సౌండ్ సిస్టం అధిక శబ్దంతో ఆటోలో ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు అటో డ్రైవర్లను హెచ్చరించారు.