calender_icon.png 4 January, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి

01-01-2025 11:17:36 PM

జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి...

కామారెడ్డి (విజయక్రాంతి): ట్రాఫిక్ రూల్స్‌ను ప్రతి ఒకరు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జాతీయ రొడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బుధవారం మొదటిరోజు కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని సూచించారు. వాహనాల లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. పోర్ విలర్ వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనాలను నడపాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదన్నారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రతపడాలన్నారు. కొద్ది పాటి నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోకూడదన్నారు. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం పనికిరాదని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒకరు పాటించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు భిక్షపతి, నాగలక్ష్మీ, అశోక్, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.