- అతి వేగం నియత్రించాలి
- మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ రోడ్డు భద్రతా వారోత్సవాల బైక్ ర్యాలీ
మెదక్, జనవరి 24(విజయ క్రాంతి): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, అతివేగం ప్రమాదానికి హేతువని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మెదక్ కలెక్టరేట్ నుండి వెల్కమ్ బోర్డు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతి వేగం నియంత్రించాలని, వాహనా దారులు అన్ని పత్రాలను కల్గి ఉండాలని, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దన్నారు.
మెదక్ జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ పంపులో ఇక పెట్రోల్ పోయారని ఇందుకు సంబం ధించి మార్గదర్శకాలు తయారుచేసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల అనంతరం త్వరలో జిల్లాలో ప్రవేశపెట్టనున్నట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఫోర్ వీలర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్క వాహనానికి ఇన్స్యూరెన్స్ చేసుకోవాలని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదనీ కోరారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేసినప్పుడు కిలోమీటర్లు మేర వాహనలు ఆపుతున్నారనీ వాహనలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.