ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, జనవరి 19(విజయక్రాంతి): ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు.
ఆదివారం జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా,కొత్త చేరువు, చంద్రంపేట,అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సంద ర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడు తూ.. వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమా దాల కారణంగా వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తనవంతు బాధ్య త గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
వాహనదారుడు క్రమశిక్షణతో వాహనలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివా రించుకోవచ్చని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబం ధనలు పాటిస్తూ వాహనాలను నడపాలన్నా రు. ప్రతి ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనంనడపాల న్నారు.
రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియమాలపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరు గుతుందన్నారు. ఈ ర్యాలీలో డిఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, సి.ఐలు కష్ణ, వీరప్రసాద్, ఆర్.ఐ రమేష్, ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది, బెటా లియన్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.