calender_icon.png 18 January, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి

18-01-2025 12:00:00 AM

కోహీర్ ఎస్సై సతీశ్ కుమార్ 

కోహీర్, జనవరి 17 : ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని కోహీర్ ఎస్సై సతీశ్ కుమార్ తెలిపారు. మండలంలోని వెంకటాపూరు గ్రామ శివారులోని గ్లోబల్ గ్రీన్ కర్మా గారంలో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కార్మికులకు ఉద్దేశించి మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ఎంతమాత్రం నిర్లక్షం తగద న్నారు. ఏ ఒక్కరు తప్పు చేసిన తప్పు చేసిన వ్యక్తితో పాటు ఇతరులకు నష్టం జరుగు తుందన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికిని ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదన్నారు. అధిక వేగం అనర్తమన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో మత్తు పదార్థాలు తీసుకోవడం తగదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఫోర్ వీలర్ నడిపే డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో కర్మాగారం అధికారి నెహ్రూ రమేష్ కార్మికులు పాల్గొన్నారు.