మహబూబ్‌నగర్, జనవరి 7 (విజయ క్రాంతి) : ప్రతి వాహన చోదకుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ముందు కు సాగాలని వన్ టౌన్ సిఐ అప్పయ్య, టూ టౌన్ సీఐ ఎజాజ్, ట్రాఫిక్ సిఐ భగవంతు రెడ్డి లు వాహన చోదకులను ఆదేశించారు. మంగళవారం మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ లు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన వారు కూడా కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని, ఇది సరైన విధానం కాదని సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ ని బంధనలు పాటించకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి, ఆపి వాటి యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
అలాగే, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించారు. ప్రధాన కూడళ్ల వద్ద నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను ఆపి వివరాలు న మోదు చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తుల కు కూడా చైతన్యం కల్పించారు.
నెంబర్ ప్లేట్ల ప్రాముఖ్యత, వాటి లేని కారణంగా చైన్ స్నాచింగ్, దొంగతనాల వంటి నేరాలు ఎలా జరుగుతాయో ప్రజలకు వివరించారు. భద్రతా ని బంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు.