కామారెడ్డి, జనవరి 1 (విజయక్రాం తి): ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా బుధవారం మొదటిరోజు కామారెడ్డి జిల్లా భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని సూచించారు. వాహనాల లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు భిక్షపతి, నాగలక్ష్మి, అశోక్ పాల్గొన్నారు.