calender_icon.png 19 April, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలి

11-04-2025 12:00:00 AM

పోలీసులకు కూలింగ్ గ్లాస్‌లను అందజేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ట్రాఫిక్ సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులను నిర్వర్తించా లని, ఒకవేళ ప్రజలు దురుసుగా ప్రవర్తించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీసు హెడ్ ఆఫీస్ లో ట్రాఫిక్ సిబ్బందితో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించి, ట్రాఫిక్ సమస్యల పరిష్కా రంపై దిశ నిర్దేశం చేశారు.

ఎండాకాలంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఎండ తీవ్రతను తట్టుకునేలా నాణ్యతతో కూడిన కూలింగ్ గ్లాస్ లను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎండాకాలం దృష్ట ట్రాఫిక్ సిబ్బంది కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎండలలో కళ్ళుకు రక్షణగా ఈ కంటి అద్దాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కంటి అద్దాలు అతినీలలోహిత కిరణాల వలన జబ్బులు వచ్చి అనారోగ్యానికి గురి కాకుం డా కాపాడతాయని తెలిపారు.

ఈ అద్దాలను సిబ్బంది ప్రతి ఒక్కరి సద్వినియోగ పరచుకోగలరని వీటివల్ల దుమ్ము, దూళి పడి కంటికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉంటుందని తెలిపారు. పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎత్తకుండా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని తెలియజేశారు.

విధులు నిర్వర్తించే క్రమంలో బాడీ ఆన్ కెమెరా లను ధరించి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్, ఎస్‌ఐ మహేందర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.