calender_icon.png 30 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ పోలీసులపై బూతుపురాణం

30-10-2024 12:12:26 AM

జూబ్లీహిల్స్ పీఎస్‌లో వాహనదారుడిపై కేసు నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు వారిని దూషించిన ఓ వాహనదారుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36 సమీపంలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్‌పై హెల్మెట్ లేకుండా రాంగ్‌రూట్‌లో వస్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు.

ఆ బైక్‌పై అప్పటికే 8 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాటిని చెల్లించాలని శ్రీనివాస్‌ను పోలీసులు అడిగారు. అయితే శ్రీనివాస్ తాను చలాన్లు చెల్లించని దౌర్జన్యానికి దిగాడు. వారిని ఇష్టానుసారంగా తిట్టాడు.

తాళం ఇస్తారా ఇవ్వరా? ఫైన్ వేసుకోండి, బైక్ తీసుకునే హక్కు ఎవరిచ్చారు అని వారించడంతో పాటు తన బైక్‌ని కిందపడేశాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించాడని శ్రీనివాస్‌పై ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.