calender_icon.png 20 January, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల వరుస.. ఎన్‌హెచ్ ట్రాఫిక్ రద్దీ

20-01-2025 12:12:06 AM

నల్లగొండ,(విజయక్రాంతి): సంక్రాంతికి నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కావడంతో జాతీయ రహదారిపై ఆదివారం ట్రాఫిక్ రద్దీ కనిపించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంతోపాటు పంతంగి టోల్‌ప్లాజాలో వద్ద వాహనాలు బారులుదీరాయి. నల్లగొండ జిల్లా  కేతేపల్లి మండలం కొర్లపహాడ్, నార్కెట్‌పల్లి రహదారిపై మాడుగులపల్లి సమీపంలోని టోల్‌ప్లాజాల్లో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం అదనంగా 2 టోల్‌బూత్‌లు కేటాయించారు. ఫాస్టాగ్ ఉండడంతో టోల్‌బూత్‌ల  నుంచి 4 నుంచి 5 సెకన్ల వ్యవధిలో వాహనాలు వెళ్లిపోవడంతో ఇబ్బందులు తప్పాయి.