హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): తార్నాక నుంచి శివంరోడ్ వైపు వెళ్లేదారిలో రాత్రి 9గంటల వరకు ఓయూ ప్రధాన గేట్లను తెరిచి ఉంచాలని వర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ మొలుగారం సిబ్బందిని ఆదేశించారు. యూనివర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు వీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం రాత్రి 8 గంటలకు ఓయూ ప్రధాన గేట్లను మూసివేస్తుండగా.. తాజా నిర్ణయంతో మరో గంటపాటు అదనంగా అవకాశం కలిగింది. రామంతాపూర్ వైపు ఉన్న రవీంద్రనగర్ కాలినడక ద్వారం నుంచి కూడా రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు కల్పించారు.