23-04-2025 12:26:07 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్22 (విజయక్రాంతి): ఎంకి పెళ్లి సుబ్బిసావుకు వచ్చిన చందాన ఉంది పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణ ట్రాఫిక్ సమస్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ని బంధనలు అతిక్రమించి సెట్బ్యాక్ లేకుండా భవనాలు నిర్మించడంతో పట్టణ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైంది.
జాతీయ రహదారి భద్రాచలం రోడ్, కిన్నెరసాని రోడ్డు, శాస్త్రి రోడ్డు, స్టేట్ బ్యాంక్ రోడ్డులో గందరగోళ పరిస్థితి ఉంది. జాతీయ రహదారి భద్రాచలం రోడ్డులో గల అంబేద్కర్ సెంటర్లోని రిలయన్స్ స్మార్ట్ షోరూం, మరోవైపు కేఎస్పీ క్రాస్రోడ్డు కావడంతో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ట్రా ఫిక్ సిగ్నల్స్ ఉన్న ఏళ్ల తరబడి అవి పనిచేయక అలంకారప్రాయంగానే ఉన్నాయి.
రోడ్లపైనే వాహనాల పార్కింగ్
పట్టణంలోని రిలయన్స్ మార్ట్కు వచ్చే వినియోగదారులు తమ వాహనాలను రో డ్డుపైన నిలుపుతుండటంతో భద్రాచలం మార్గంలో ప్రయాణించే వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. దీనికి తోడు రిలయన్స్ మార్ట్ లో సరుకులు కొనుగోలు చేసిన వినియోగదారులు కార్లను రోడ్లపైనే నిలిపి ఉంచి సరుకుల నింపుకోవడం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
కిన్నెరసాని రోడ్ లో గల మీసేవ టిఫిన్ సెంటర్ వద్ద ఉద యం, సాయంత్రం వేళల్లో సగం రోడ్డు వర కు వాహనాలు నిలుపడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమస్యను చూసి కూడా చూడనట్టే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అధికారుల చర్యలు శూన్యం
ఒకవైపు జిల్లా అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసు కోవాలని పదేపదే ఆదేశిస్తున్న, క్షేత్రస్థాయి లో మాత్రం ట్రాఫిక్ నియంత్రణపై, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు శూ న్యం. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై ఉన్నారంటే కేవలం ఫొటోలు తీయటానికి తప్ప, ట్రాఫిక్ నియంత్రణపై ఎలాంటి దృష్టి సా రించకపోవడం గమనార్హం.
గతంలో పాల్వం చ పట్టణానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మం జూరు చేస్తామని ప్రభుత్వ హామీ ఆచరణలో అమలు కాలేదు. కనీసం ట్రాఫిక్ పోలీసులు సైతం పాల్వంచ పట్టణంలో విధులు నిర్వహించిన దాఖలాలు లేవు. గతంలో ట్రాఫిక్ ఎస్త్స్రగా రాజు విధులు నిర్వహించిన రోజు ల్లో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా అమల్లో ఉండేది.
ఆయన బదిలీ అనంతరం పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు పాల్వంచ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.