calender_icon.png 11 March, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణ తరగతులు ప్రారంభం

11-03-2025 12:56:27 AM

 కొత్తగూడెం మార్చి 10 (విజయక్రాంతి ): ఏ రంగంలో పనిచేసిన వారి కైనా క్రమశిక్షణ తప్పనిసరి అని ఎస్‌ఓ టు జీఎం (ట్రాఫిక్) వేణుమాధవ్ అన్నారు.సింగరేణి ప్రధాన కార్యాలయంలో నాలుగు రోజులపాటు జరగనున్న  49 వ, ట్రాఫిక్ కంట్రోల్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది అందరికీ క్రమశిక్షణ అనేది ముఖ్యం అని, మంచి క్రమశిక్షణతో  గుర్తింపు వస్తుందన్నారు. ఈ శిక్షణ అందరికీ అవసరం అని,  ఈ నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమానికి,యస్& పిసి విభాగము పటిష్టంగా ఉండేందుకు కావలసిన అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు.

ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు యాజమాన్యం అందిస్తుంది అని, సెక్యూరిటీ సిబ్బంది అందరు సింగరేణి ఆస్తులు, స్థలాలను పరిరక్షించాలన్నారు. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వి. వెంకటరమణ, రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి  నారాయణరెడ్డి, ట్రైనింగ్ ఇన్ స్పెక్టర్,  ట్రైనింగ్ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.