calender_icon.png 26 February, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతరలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు

25-02-2025 08:50:22 PM

వైరా (విజయక్రాంతి): వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం శ్రీరామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో నిర్వహించే జాతరకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైరా పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం వైరా ఎస్సై-2 వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా వీఐపీ పార్కింగ్ తో పాటు సాధారణ పార్కింగ్కు సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాక వేలాది మంది భక్తులు విచ్చేసే ఈ జాతరలో దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దొంగలున్నారు జాగ్రత్తని బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాహన వేగాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. కానిస్టేబుళ్లు పాషా, రంగారావు నరసింహారావు, హుస్సేన్ లు ఏర్పాట్లలో ప్రత్యేక చొరవచూపారు.