14-04-2025 12:38:18 AM
బాలానగర్ ఐడీపీఎల్ వద్ద ఘటన
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): ట్రాఫిక్ ఛలానా భయం ఓ వాహన దాడి ప్రాణం తీసింది. బాలానగర్ ఐడీపీఎల్ వద్ద ట్రాఫిక్ జరిగిన ఈ ఘటన ఆ మార్గంలోని వాహనదారుల్లో ఆగ్రహానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ఓ బైకును ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నించారు. వారిని తప్పించుకునేందుకు ప్రయ త్నించి ఆ వాహనదారుడు అదుపుతప్పి కింద పడిపోయాడు.
దీంతో ఆ మార్గంలో వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు నుంచి అతని తలపై నుంచి వెళ్ళిపోయింది. ఆ వాహనదారుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దానికి తోడు మృతుడికి సంఘీభావంగా వాహనదారులు ఆందోళనకు దిగారు. తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాటి ఛార్జ్ చేశారు.