calender_icon.png 11 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన

18-07-2024 09:09:53 PM

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ జి.శంకర్‌రాజు అన్నారు. గురువారం బొల్లారం రిసాలబజార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బేగంపేట ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలు వాటి నివారణపై  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని, రోడ్డు భద్రత, నియమాల గురించి వారి బోధనాంశాలలో కూడా చేర్చాలని అన్నారు. అలాగే రహదారులపై క్రమశిక్షణగా వ్యవహారించాలని సూచించారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా లైన్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ వంటి వాటి ఉపయోగం గురించి వివరించారు.

ఈ మధ్య కాలంలో మైనర్ పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ రాక ముందే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కొల్పోతున్నారనిఅది చట్టరీత్యానేరం అని అన్నారు. పాఠశాలకు వచ్చే క్రమంలో ఆటోలలో కూడా ఐదుగురి కంటే ఎక్కువగా విద్యార్థులు ఎక్కువవద్దనీ, స్కూల్ యాజమాన్యం కూడా ఆటోలపై నిఘా ఉంచాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.