calender_icon.png 16 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంప్రదాయాలను గౌరవించాలి

16-01-2025 04:40:16 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) అన్నారు. గురువారం కెరామెరి మండలం ఇందాపూర్ గ్రామంలో పోతురాజు ధర్మరాజు దేవాలయంలో జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆదివాసి సంస్కృతి సాంప్రదాయలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గిరిజనుల జీవనశైలి ప్రత్యేకమైనదని సమాజంలోనే గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.